- ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియలు.
- హాజరైన ప్రజాప్రతినిధులు, నేతలు, ఉన్నతాధికారులు.
దగదర్తి, అక్టోబర్ 20 :(మన ధ్యాస న్యూస్ )://
ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అంత్యక్రియలకు ప్రజా ప్రతినిధులు నేతలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంత్యక్రియలలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, శాసనమండలి విప్ కంచర్ల శ్రీకాంత్, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్, మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మి నాయుడు, బొల్లినేని వెంకట రామారావు, టిడిపి సీనియర్ నాయకులు గూడూరు మురళి కన్నబాబు, తదితరులు పాల్గొని సుబ్బానాయుడుకు కన్నీటి వీడ్కోలు పలికారు. ముందుగా మాలేపాటి సుబ్బానాయుడు భౌతిక కాయానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు.

అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ మేరకు పోలీసు సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు.








