హైదరాబాద్ మధురానగర్ లో చిరు వ్యాపారులతో టి ఎన్ ఆర్ ఫ్యామిలీ దీపావళి సంబరాలు..!
వింజమూరు అక్టోబర్ 19(మన ధ్యాస న్యూస్):?/
వింజమూరు మాజీ జడ్పిటిసి సభ్యులు,శ్రీ తిప్పిరెడ్డి నారపరెడ్డి, ఆయన కుమారుడు తిప్పి రెడ్డి భరత్ రెడ్డి హైదరాబాదులోని మధురానగర్ లో ఉన్న చిరు వ్యాపారులకు దీపావళి కానుక అందజేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో వన్ ఇండియా, వన్ విలేజ్, దీనదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తిప్పిరెడ్డి భరత్ రెడ్డి తో కలిసి సంబరాలు నిర్వహించారు. చిరు వ్యాపారులతో కలిసి కాకర్స్ కాల్చడం తో పాటు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అందరికీ, కాకర్స్ టపాసులతోపాటు, పిండి వంటలు చేసుకునేందుకు, గోధుమ పిండి కూడా అందజేశారు. ఈ సందర్భంగా తిప్పిరెడ్డి నారపరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వింజమూరులోని జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో దీపావళి సంబరాలు నిర్వహించే వారిమని ఈ ఏడాది అందుబాటులో లేనందున, స్వగ్రామంలో చేయలేక హైదరాబాదులో చేశామని తెలిపారు. పేదవారిని ఆదుకునేందుకే తండ్రి కొడుకులం ఇద్దరం చారిటబుల్ ట్రస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ట్రస్టు ద్వారా అనేక మందిని ఆదుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో తిప్పిరెడ్డి ఆ యుత్, తిప్పిరెడ్డి హాసిని, సన్నీ తదితరులు ఉన్నారు.







