సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక..!
కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి..!
వింజమూరు అక్టోబర్ 19 : మన ధ్యాస న్యూస్
జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక అని ఎమ్మెల్యే, పేర్కొన్నారు..ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు.టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరసంపద రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు. అష్టలక్ష్ములు ప్రతి ఇంట్లో నెలవై సకల శుభాలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విజయాలను, సిరి సంపదలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని, తెలుగింటి లోగిళ్లన్నీ దీప కాంతులతో వెలుగులీనాలని, ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని, సరికొత్త వెలుగులతో ప్రజల జీవితాలు మరింత ప్రకాశించాలని ఆకాంక్షించారు.







