మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పండుగలు బంధాలను మరింత బలపరుస్తాయి — అదే విషయాన్ని నిరూపించింది రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ బీ శివధర్ రెడ్డి,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలయిక.శనివారం ఎమ్మెల్యే కాంతారావు దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శుభానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టు కొమ్మను అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఇద్దరి మధ్య ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమే కాదు — పాత స్నేహానికి ప్రతీకగా మారింది.ఎందుకంటే డీజీపీ బీ శివధర్ రెడ్డి,ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇద్దరూ ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు.శివధర్ రెడ్డి ఆ సమయంలో కాంతారావుకు సీనియర్ కావడం విశేషం.
కాసేపు అధికారికతను పక్కనపెట్టి,ఇద్దరూ యూనివర్సిటీ రోజుల జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.హాస్టల్ జీవితం,తరగతి గదుల్లోని కబుర్లు,ఆ కాలంలోని స్నేహ వాతావరణం అన్నీ మరోసారి సజీవంగా మారాయి. పాత స్నేహితుల మధ్య చిట్‌చాట్‌లా సాగిన ఈ కలయిక పండుగ సందర్భంలో ప్రత్యేకతను సంతరించుకుంది.







