బంగారుపాళ్యం,సెప్టెంబర్ 22. మన ద్యాస
:బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య లోపాన్ని గ్రామ మరియు మండల స్థాయి అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో సోమవారం బంగారుపాళ్యం మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్. రవితేజ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.వెంటనే స్పందించిన డీపీవో సుధాకర్ పంచాయతీ కార్యదర్శి శివరామకృష్ణకు చరవాణి ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో తుంబకుప్పం గ్రామంలో హుటాహుటిన పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.పోటో1. యంత్రాలతో చెత్తను తొలగిస్తున్న అధికారులు.







