బంగారుపాళ్యం సెప్టెంబర్ 22 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతుండేవారు.జంబువారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరుగుదొడ్లు నిర్మించినప్పటికి ప్రారంబానికి నోచుకోక అలాగే ఉండిపోయింది ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న కూటమి నాయకులు బుధవారం బంగారుపాళ్యం సీనియర్ టిడిపి నాయకులు ఎన్.పి జయప్రకాష్ నాయుడు,మండల కన్వీనర్ ఎన్.పి ధరణి ఆదేశాలతో ఎన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.బుధవారం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ప్రారంబించడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ అమర,ఉప సర్పంచ్ కమలనాథ్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి కె.మంజునాథ్ లు తెలిపారు.









