చిత్తూరు, మనధ్యాస, సెప్టెంబర్ 21
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెడ్డి సమాజం యొక్క కార్యచరణ, ఇంతవరకు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణలపై విస్తృతంగా చర్చించారు.రెడ్డి సమాజ ఐక్యత, యువత శక్తి, విద్యా రంగ అభివృద్ధి, రాజకీయ అవగాహన పెంపొందించడంపై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు.సమావేశంలో మాట్లాడిన నాయకులు మాట్లాడుతూ –”రెడ్డి సమాజం సమిష్టిగా ముందుకు సాగాలి. సంఘీభావం ద్వారా మరెన్నో విజయాలు సాధించవచ్చు. భవిష్యత్ తరాల కోసం మనం తీసుకునే నిర్ణయాలు ముఖ్యమైనవిగా ఉండాలి” అని ఆకాంక్షించారు.రెడ్డి సమాజ కార్యాచరణకు దీటైన భవిష్యత్ వ్యూహాలు సిద్ధం చేస్తూ, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.సభ సమాప్తి సందర్భంగా విజయం ప్రతీకగా “రెడ్డి – జై జై రెడ్డి” నినాదాలు ఘోషించాయి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ చంద్రారెడ్డి రాష్ట్ర సెక్రెటరీ సి.సిద్ధారెడ్డి జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి రెడ్డి పూతల పట్టు రెడ్డి జాగృతి నాయకులు పాల్గొన్నారు.







