

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 11 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు రైల్వే బ్రిడ్జి మళ్ళీ నీటిలో నిండుతున్నయి.ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలుచుని ఉండడంతో ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సమీపంలో ఉన్న పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరియు కొన్నిచోట్ల పిల్లకాల్వలకు గండ్లూ పండడంతో వర్షపు నీటి ప్రవాహంలోనే పత్తి, కంది పంటలు మునిగిపోయాయి.విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలా లేదా అని అయోమయంలో చాలా మంది విద్యార్థులు ఇంట్లో ఉండిపోయారు. గత రెండు రోజుగా కురుస్తున్న వర్షాలకు మానవపాడు, అమరవాయి, చెన్నిపాడు, గోకులపాడు పోతులపాడు ఈ గ్రామలలో వాగులు ఇరువైపులా పొంగి పోర్లటంతో రాకపోకలు బందు ఇలా వాగులు రావడంతో విద్యార్థులు స్కూళ్లకు కాలేజీ లకు వెళ్లలేక మరియు గ్రామ ప్రజలు ఎటు వెళ్లలేని పరిస్థితి అంతేకాదు ఆయా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వచ్చింది అంటే చాలు చిన్నపాటి వర్షాలకు వాగులు పొంగి పొర్లుతాయి అంతేకాదు అకాల వర్షానికి పిల్ల కాలువలకు గండిపడటంతో ఆ నీరంతా పంటపోలలోకి చేరి పంటలు సర్వనాశనం అవుతున్నాయి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి నీటిలో మునిగిన పత్తి, కంది పంటలు నీరు పొలాలలో చేరడంతో రైతుల గోస చెప్పుకుంటే తీరనివి అయ్యా ప్రజాప్రతినిధులరా, అధికారులరా మాపై దయవుంచి మా ఊర్లకు బిర్జులు వెయ్యండి అంటూ ప్రాధేయపడుతున్నారు.
