ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ చేశాం.
ఉరవకొండ మన ధ్యాస : అనంతపురం జిల్లా కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ అధ్యక్షతన సూపర్ హిట్ సభ నిర్వహించారు. అనంత ముగ్గురు మొనగాళ్లుగా మూడు పార్టీల కూటమి నేతలు నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చామని ఎన్ని కష్టాలు ఉన్నా తీర్చామని పేర్కొన్నారు పథకాలు అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోరుతున్న పాలన్నే అందిస్తుందని తెలిపారు. మాది జవాబుదారీ పరిపాలన అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు తాను నాలుగు పర్యాయాలు సీఎం గా పని చేశానని తెలిపారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని కామన్ మ్యాన్ అని అభివర్ణించారు. స్వయం సమృద్ధి సాధించే విధంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు గత ప్రభుత్వం సాధ్యం కానివని హేళన చేసిన అన్నింటిని సాధ్యం చేసి చూపించామన్నారు. ఆడబిడ్డల సంతోషమే కూటమి కూటమి ప్రభుత్వ సంతోషమని తెలిపారు సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, 20 24 ఎన్నికలు చరిత్రను తిరగరాసి ప్రజల సత్తా ఏమిటో నిరూపించారన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక అఘాతంలోకి నెట్టింది అన్నారు ప్రతిపక్ష హోదా కావాలని ప్రభుత్వాన్ని అడగటం సిగ్గుచేటు అన్నారు. ప్రతిపక్ష హోదాని ప్రజలే ఇస్తారని తెలిపారు. రాయలసీమను రతనాల సీగమగా మారుస్తామని హామీ ఇచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం ఒక్కటే పూర్తి చేసిన ఘనత గత ప్రభుత్వానిది. భూమిస్తే పునాదులు వేస్తే మెడికల్ కాలేజీలు రావని గుర్తు చేశారు. .

గతంలో సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డ వైసీపీ నేత చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హింస రాజకీయాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోయేది లేదని సీఎం హెచ్చరించారు వైసీపీ పార్టీ తమ ఉనికి కోల్పోతుందని కూటమి పాలనను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు దసరా రోజున ఆటో వాళ్ళలకు వాహనం వాహన మిత్ర పథకం అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఏడాదికి 15000 చొప్పున ఇస్తామని తెలిపారు కోటి మొక్కలను నాటే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. పేదల ఆకలి తీర్చడానికి రాష్ట్రవ్యాప్తంగా 2004 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి తద్వారా ఆకలి తీర్చామని తెలిపారు కూటమి ప్రభుత్వ పాలన భేషు గా ఉందన్నారు. ప్రధాని రాష్ట్ర ప్రభుత్వానికి అండదండగా ఉన్నారన్నారు. తద్వారా రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీల నేతలు ముగ్గురు మొనగాళ్లుగా రాజ్యమేలుతున్నారనిచ్చారు. జిల్లా కేంద్రంలో ఇసుకేస్తే రాలనంత మంది హాజరుకాగా కూటమి నాయకుల ఉత్సాహం రెట్టింపు అయింది. మూడు పార్టీల నేతలు కార్యకర్తలు చేసిన సేవలకు నాయకులు గుర్తుంచుకొని తగు హోదాలు సాయం చేయాలని నాయకులను చంద్రబాబు కోరారు. అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలని నాయకులకు పిలుపునిచ్చారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, కామన్ మ్యాన్ అని, హోదాలు మరిచి జవాబుదారీతనంగా ప్రజలతో మమేకమై ప్రజాసేవకే అంకితం కావాలని ప్రజలకు నేతలకు పిలుపునిచ్చారు. తన తుది రక్తం బిందువు చిందించేంతవరకు ప్రజాసేవకే అంకితం అని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఈ సభలో కూటమి పార్టీల ప్రజలను నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం కొనగల పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు నిమ్మల రామానాయుడు ఏపీ బిజెపి చీఫ్ మాధవన్ , తదితరులు ప్రసంగించారు

  • Related Posts

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    ప్రమాదపుటంచన ఊటుకూరు జువ్వు గుంట పాలెం చెరువులు..!మండలంలో 12 చెరువులకు 75% మరో2, చెరువులకు25 శాతం చేరిన నీరు..!చెరువులను పరిశీలించిన, డి ఈ రమణారావు, ఏ ఈ లు శ్రీనివాసులు, మహేంద్ర, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి..! వింజమూరు,అక్టోబర్ 29 :మన…

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..