

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో ప్రధానమైనవి కానీ కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతల్ని రాజకీయ కోణాల్లో చూడటం బాధాకరం సామాజిక న్యాయం పట్ల నెహ్రూ కుటుంబానికి ఉన్న హేళన భావజాలాన్ని రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బిసి సమాజానికి దేశ అత్యున్నత పదవుల్లో ప్రాతినిధ్యం రావాలనే ఆకాంక్షలను బిజెపి కి అవకాశం ఉన్న ప్రతిసారి నెరవేరుస్తున్నది అందుకే సకల జనుల పార్టీగా బిజెపి ని ప్రజలు ఆదరిస్తున్నారు. గౌ శ్రీ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు “ఉప రాష్ట్రపతి” గా ఎన్నికవడం దేశ ప్రజాస్వామ్యానికి ఒక పండుగ. సమాజ వాణి, హక్కులు, గౌరవం ప్రతిధ్వనించేలా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నది అని రాధాకృష్ణన్ గారి ఎన్నిక ద్వారా అర్ధం అవుతుంది ఇది వికసిత భారత్ వైపుకి కొన్ని అడుగులను జోడిస్తుంది. ఈ ఎన్నిక బిజెపి కి “సామాజిక న్యాయం పట్ల ఉన్న అంకితభావం.” ను ప్రతిబింబిస్తుంది భారతీయ జనతా ఒబిసి మోర్చా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా గారికి ఎన్డీయే లో పార్టీలకు నాయకులకు ధన్యవాదములు తెలుపుతూ శ్రీ రాధాకృష్ణన్ గారికి ఆంధ్రప్రదేశ్ లో బిసి సమాజం తరపున శుభాకాంక్షలు తెలియచేస్తు హర్షం వ్యక్తం చేస్తున్నాం.