

ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు ://///
ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో దుర్భాషలాడిన ఘటనపై జిల్లా ఎస్పీ కి గత సోమవారం బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ విషయంపై స్పందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవ వ్యవస్థాపకులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు స్పందించి ఆయన బుధవారం ఉదయగిరి మండల పరిధిలో ఉన్న జి చెర్లోపల్లి గ్రామాన్ని ఎస్సీ కులాలకు చెందిన బాధితులతో కలిసి ఆక్రమణకు గురైన స్థలాన్ని సందర్శించి పరిశీలించడం జరిగింది.ఈ మేరకు కొప్పాల రఘు మాట్లాడుతూ బిసి కులానికి చెందిన ఒక వర్గం స్థానిక సర్పంచి సమీప బంధువు కావడంతో వారి అండతో గత మూడు రోజుల క్రితం ఎస్సీ కాలనీలోకి జొరబడి వారి ఇంటి స్థలాలను ఆక్రమించి చుట్టూ కంచి వేసి ఎస్సీ మహిళలపై దాడికి ప్రయత్నించడమే కాక మహిళలు అని కూడా చూడకుండా కుల దూషణ చేసిన బీసీ వర్గస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ మరియు ఎస్సీ కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.