

అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు :///////
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం నిర్వహించిన ” సూపర్ సిక్స్ – సూపర్ హిట్ ” బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. ఈ సభకు ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారు సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గత 15 నెలల కాలంలో ప్రతి వర్గానికి మేలు చేకూర్చేలా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు.ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న సబ్సిడీలు, మహిళలు, యువత, విద్యార్థులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అంశాలను వివరించారు, దీనితో పాటు ఈ సభల ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, వారి అభిప్రాయాలను స్వీకరించి పాలనను మరింత బలోపేతం చేయడం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ప్రజలు భారీ సంఖ్యలో హాజరై, ఉత్సాహభరిత నినాదాలతో సభను విజయవంతం చేసారు.