

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్ మేనేజర్, ఇవన కమ్యూనికేషన్ అసోసియేట్ మాట్లాడుతూ… వాతావరణ సంబంధిత ఆరోగ్య అవసరాలను తెలుసుకోవాలని అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు తెలియజేశారు. వాతావరణం మార్పుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందితో గ్రామంలో ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి క్షేత్రస్థాయిలో గడపగడపకు వెళ్లి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎంలు పలు అంశాలపై స్వస్తి టీం ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఈ ఓ గురు ప్రసాద్, సూపర్వైజర్ నాగ శంకర్, హెల్త్ అసిస్టెంట్లు నాగరాజు, సంపత్ కుమార్, ఎం.ఎల్.హెచ్.పి భారతి, ఏఎన్ఎంలు జ్యోతి, లక్ష్మి, రాజేశ్వరి, స్టాఫ్ నర్స్ సుజాత, ఫార్మ్ సిస్ట్ రామచంద్ర, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.