

పూతలపట్టు నవంబర్ 26 మన న్యూస్
పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, పేట అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు డి.కాంతారావు ఆకస్మిక మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాంతారావు స్వగృహం వద్దకు చేరుకున్న *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ * కాంతారావు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళు అర్పించారు. భాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. అనంతరం కాంతారావు భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను, విశ్వాసాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం కాంతారావు అంతిమ యాత్రలో పాల్గోన్న స్ధానిక శాసనసభ్యులు మురళీమోహన్ స్వయంగా పాడేను మోసారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు మాట్లాడుతూ.. టిడిపి సీనియర్ నాయకుడు కాంతారావు మృతి పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, తన రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, ప్రజా సేవలు చిరస్మరణీయమని ఆయన ప్రశంసించారు. కాంతారావు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసి కార్యదర్శి యువరాజుల నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మన్ మణినాయుడు, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు హిమగిరి నాయుడు, మాజీ మండల అధ్యక్షులు చంద్రమౌళి, సీనియర్ నాయకులు బాబు రావు, చంద్రబాబు, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.