

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం ఈ నెల 16న అర్ధాంతరంగా నిలిపివేసిన జీడిపిక్కలు ఫ్యాక్టరీ తెరిపించాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై కూర్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రతిపాడు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 16న జీడిపిక్కలు ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసివేశారన్నారు. ఫ్యాక్టరీ మూసివేయడంతో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 409 మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఫ్యాక్టరీని తెరిపించాలని పది రోజులుగా అనేక విధాల నిరసన చేపట్టిన, అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కంట చక్రధర్, కర్రీ రాజా, కాకర ప్రసాద్, వనము దుర్గాప్రసాద్, ఎ రామదుర్గ, సిహెచ్ గోవింద్, వై రమేష్, జి వీరబాబు, ఎస్ జయలక్ష్మి, వై శివ వరలక్ష్మి, కె కృష్ణవేణిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారు.