

దుత్తలూరు, మనన్యూస్ : గత వైసీపీ ప్రభుత్వంలో, వ్యవస్థలను, విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం వైపు మళ్లించిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
గురువారం ఉదయగిరి నియోజకవర్గం లోని దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామం బీసీ కాలనీ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు. ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ పంపిణీ మన రాష్ట్రంలోనే జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మూడు వేల పెన్షన్ 4000 రూపాయలు, వికలాంగుల పెన్షన్ 6000, డయాలసిస్ పేషెంట్లకు 15000 రూపాయలు క్రమం తప్పకుండా ఒకటవ తేదీన అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అద్భుతమైన తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించి అక్క చెల్లెమ్మల కళ్ళలో ఆనందం చూసిన ప్రభుత్వం తెలుగుదేశం అన్నారు. రాష్ట్రంలో గుంతల మయంగా ఉన్న రోడ్లను బాగు చేయడమే కాకుండా, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. ఏ ఇంటికెళ్లిన ఆడపడుచులు ఆనందంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని ఆహ్వానించి, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీరు ప్రజాసేవకులు అంటూ ఆశీర్వాదాలు అందించారు. చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పరిష్కారం మార్గాన్ని చూపారు.
పండుగ వాతావరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, మాజీ మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నపరెడ్డి వెంగళరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు పాముల సుబ్బరాయుడు, చీదర్ల మల్లికార్జున, మండవ మధు, మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు, మల్లంపాటి గురవయ్య నాయుడు, మాదాల తిమ్మయ్య, అధికారులు ముఖ్య నాయకులు గ్రామ నాయకులు క్లస్టర్, యూనిట్,బూత్ ఇన్చార్జిలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.