

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతుల కన్నీళ్లు పెడుతుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కష్టాలు పెడుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి మండిపడ్డారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బుధవారం ఫ్యాక్టరీ ఎదుట కిలోమీటర్ల మేర మామిడి ట్రాక్టర్లతో నిలుచున్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రైతులు మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి, కృపా లక్ష్మికి ప్రభుత్వం తమను పెడుతున్న ఇబ్బందిని, రైతుల పడుతున్న కష్టాలను వివరించారు. ప్రభుత్వం జూన్ 7వ తేదీ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చలు జరుపగా ఎయిట్ ప్లస్ ఫోర్ అమ్ములు చేస్తామని మోసపూరితపు హామీ ఇచ్చారని, నేటి వరకు ఏ కర్మాగారంలోను ఎయిట్ ప్లస్ ఫోర్ ఇవ్వలేదన్నారు. చర్చలు మే నెలలోనే జరుపుంటే నేడు రైతు పడుతున్న ఇబ్బందులు ఉండేవి కావున్నారు.

రైతు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని మండిపడ్డారు. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు దొంగ దారిలో టోకెన్లు అమ్ముకొని రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. టోకెన్లను రెవిన్యూ అధికారులు సీరియల్ గా ఇవ్వకుండా వన్ బై వన్ మిస్ చేసి ఇవ్వడం వల్ల దొడ్డి దారిన టోకెన్ లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను విన్న మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృపా లక్ష్మి కూటమి ప్రభుత్వం మామిడి రైతుల జీవితాలతో ఆటలాడుకోవడం తగదని, రోజులకు రోజులు తిండి నిద్ర లేకుండా రోడ్లపై పడిగాపులు కాస్తుంటే ఇలా చేయడం దారుణమన్నారు.

ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎయిట్ ప్లస్ ఫోర్ కచ్చితంగా అమలు చేయాలని, రోజులు గడుస్తున్న ట్రాక్టర్లలో అధిక శాతం మామిడి కుళ్ళిపోతుండడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాలు రిజెక్ట్ చేయడంతో గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతుకు కుళ్ళి నా సమస్య కూడా తీవ్రమావ్వడడంతో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పడుతున్న కష్టాలపై నివేదిక అందించామని తెలిపారు. అనంతరం రోడ్లపై మామిడిపండ్లతో వేచి ఉన్న రైతులకు నారాయణస్వామి, కృపా లక్ష్మి , మండల నాయకుల చేతుల మీదుగా అన్నదానం, మజ్జిగ , వాటర్ బాటిల్లు అందించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.