

ఉరవకొండ, మన న్యూస్ జులై 6: తుంగభద్ర, కృష్ణా నదులు కోస్తాంధ్ర ప్రాంతం కోసమే జన్మించాయని ప్రముఖ న్యాయవాది జీవీ కృష్ణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం 879 అడుగులకు చేరుకున్నప్పటికీ, రాయలసీమ ప్రాంతానికి న్యాయబద్ధంగా కేటాయించాల్సిన నీరు విడుదల చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి విడుదలపై ఆరోపణ,
“శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం 834 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ రిజర్వాయర్లకు నీరు విడుదల చేయాలి. మల్యాల లిఫ్ట్ నుండి హంద్రీ నీవా ప్రాజెక్ట్కు కూడా నీరు పంపవచ్చు. కానీ, కోస్తాంధ్ర ప్రాంతం నీటిని ఏకపక్షంగా దోచుకుంటోంది” అని కృష్ణమూర్తి ఆరోపించారు. రాయలసీమ ప్రాంత 53 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, మంత్రులు ఈ అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై డిమాండ్.కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా, రాయలసీమలోని కర్నూలులో ఆంధ్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.