

గూడూరు, మన న్యూస్ :- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో.. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. గూడూరు రెండవ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య, గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీమతి ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో జులై 6, ఆదివారం ఉదయం 9 గంటలకు సమాఖ్య అధ్యక్షులు ఆనిమెళ్ళ శివకుమార్ దంపతులు, నెల్లూరు వాస్తవ్యులు పండితోపన్యాసకులు, విశ్రాంత తెలుగు పండితులు బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణిశర్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు ఇటీవల సమాఖ్య సభ్యులు సమావేశమై బ్రాహ్మణ బంధువులు సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు అందుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షలు ఆనిమెళ్ళ శివకుమార్, కార్యదర్శి చిట్టమూరు శ్రీనివాసరావు, కోశాధికారి వి.లలితమ్మ, కడివేటి రామమూర్తి, పురుషోత్తమరావు, డి.బి.శ్రీనివాసరావు, వి.ఎల్.నరసింహం, ప్రకాశం తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.