

మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల బాలికలకు వేరు వేరు గా ర్యాంకింగ్,చదరంగం,పోటీలు నిర్వహించడం జరిగినది, ఈ టోర్నమెంట్ కె.వి.వి.శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి 80 మంది చెస్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది, గెలుపొందిన చెస్ క్రీడాకారులకు బహుమతి ప్రధానం షీల్డ్ ,మెడల్స్ తో సత్కరించడం జరిగినది,ఈ బహుమతి ప్రధానానికి ముఖ్య అతిథులుగా మండవల్లి వెంకటేశ్వరరావు , సాలూరు టిడిపిపట్టణ అధ్యక్షుడు నిమాది తిరుపతి రావు (చిట్టి)జే.బి. తిరుమల చార్యులు, మొయిద కృష్ణ మాస్టర్ రాష్ట్ర చెస్ అధ్యక్షులు ఏ సురేష్ కార్యదర్శి జగదీశ్వర్ రావు, పాల్గొనడం జరిగినది. ఈ టోర్నమెంట్ కు సహకరించిన స్థానిక ప్రతినిదులు కె.మార్టిన్ లూథర్, అత్యం తిరుమలేశ్వరరావు కందాళ శ్రీనివాసరావు మూడట్ల గణేష్ నాయుడు, కందాల శ్రీనివాసరావు ఆచార్యులు వారి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగినది.