

మన న్యూస్,తిరుపతి : – మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయలు 70 వ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రుయా ఆసుపత్రి వద్ద సింగంశెట్టి సుబ్బరామయ్య, సంగీత బాబు ల ఆధ్వర్యంలో బత్యాల చెంగల్ రాయలు జన్మదినాన్ని పురస్కరించుకొని 100 మంది రోగులకు, పేదలకు అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ చంగల్ రాయులు హాజరై రోగులకు పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సింగంశెట్టి సుబ్బరామయ్య మాట్లాడుతూ బత్యాల చంగల్ రాయులు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని ఆకాంక్షించామన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆయన మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు. ఈ అన్నదాన కార్యక్రమంలో తిరుత్తని వేణుగోపాల్, నైనారు జగదీష్, కాసారం హరీష్, జంగం ముని సుబ్రహ్మణ్యం దేపూరి నగేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, బలిజ సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను కూటమి నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.