

నగరి, చిత్తూరు జిల్లా, జూలై 6 (మన న్యూస్):– చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ రచయిత, తిరుచానూరుకు చెందిన కవి, మాదిగ మహాసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నందిపాక అంజనాద్రిని మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా అభినందించారు. ఈ సందర్భంగా “శ్రీ శ్రీ కళావేదిక” ఆధ్వర్యంలో కత్తిమండ ప్రతాప్ సమర్పించిన వరల్డ్ రికార్డు ప్రశంసా జ్ఞాపికను మాజీ మంత్రి రోజా గారు తిలకించారు. అనంతరం అంజనాద్రి రచనల్లోని సామాజిక స్పృహను, ప్రజల కోసం ఆయన గల కళాసేవను మెచ్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్యామ్ లాల్, మాదిగ మహాసేన నాయకులు, పలువురు వైస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆర్జే రోజా మాట్లాడుతూ, “అంజనాద్రి వంటి యువ కవులు సమాజాన్ని ముందుకు నడిపించే సృజనాత్మక శక్తి. వారి అభివృద్ధికి మద్దతుగా నిలబడాలి,” అని పేర్కొన్నారు.