

ఉరవకొండ మన న్యూస్ జులై 6 :- మొహారం పండుగను పురస్కరించుకుని అమిద్యాల గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రుషేంద్ర, ప్రశాంతి దంపతులు వెండితో తయారు చేయించిన 2కేజీల గుర్రం, శంకు-చక్రాలను పెద్ద వన్నూరు స్వామి, చిన్న వన్నూరు స్వామి పీర్లకు అందించారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద నుండి మేళతాళాల మధ్య ఊరేగింపుగా గుర్రం, శంకు-చక్రాలను పీర్ల చావడి వరకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం వాటిని పీర్లకు అలంకరించారు. మొక్కును చెల్లించుకోవడంలో భాగంగా వీటిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు వారు తెలిపారు.