సరుకు రాలే..ఎగ్ బిర్యానీ పెట్టలే.చిన్నారులకు అందని పౌష్టిక ఆహారం

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అంగన్ వాడి సెంటర్ల ద్వారా ఎగ్ బిర్యానీ పథకం చిన్నారులు, బాలింతలు,గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అందించాలని సదుద్దేశంతో ప్రభుత్వం పథకం ని చేపట్టింది.బుధవారం నిజాంసాగర్ మండలంలోని కొన్ని సెంటర్ లో మన న్యూస్ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించగా కొన్ని సెంటర్ లో గుడ్లు సరఫరా లేనందున పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టలేకపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి బుధవారం అంగన్ వాడి సెంటర్ లో ఎగ్ బిర్యానీ ని వండి పెట్టవలసి ఉండగా కొన్ని సెంటర్లలో మెనూ పాటించకుండా పప్పు అన్నం ఉడికించిన గుడ్డు మాత్రమే అందిస్తున్నారు.కొన్ని అంగన్ వాడి సెంటర్ లో నందు ఎగ్ బిర్యానీ అందిస్తున్నారు. మరికొందరు ఎందుకు ఎగ్ బిర్యానీ అందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గుడ్ల సరఫరా లేనందున ఎగ్ బిర్యానీ అందించడం లేదని అంగన్ వాడి టీచర్లు అంటున్నారు.కొన్ని సెంటర్లలో పోయిన బుధవారం ఎగ్ బిర్యానీ అందించామని ఈ వారం సరుకులు లేనందున పెట్టలేదని అంటున్నారు. అక్కడ రోజువారి గా అందించే మెనూ పరిశీలించగా పాతమేను దర్శనమిస్తుంది. అయితే పై అధికారులు ముందు చూపుగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సరుకులను సకాలంలో అందిస్తే చిన్నారులకు పౌష్టికాహారం సకాలంలో అందుతుంది.నిజాంసాగర్ ఐసిడిఎస్ సెక్టార్లు మొత్తం 27 అంగన్ వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి.ఈ సెంటర్లలో ఒక్కోసారి గుడ్లు పాడైపోయినవి వస్తున్నాయి. ఇదేంటని గ్రామస్థులు అంగన్ వాడి సిబ్బందిని ప్రశ్నించగా పైనుండి అలాగే వస్తున్నాయి.దీనికి మేమేం చేస్తామని సమాధానం చెబుతున్నారని ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారుల స్పందించి అంగన్ వాడి లో సెంటర్లలో మెనూ పాటించని సెంటర్లపై చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయంపై నిజాంసాగర్ అంగన్ వాడి సూపర్ వైజర్ విజయలక్ష్మి ని మన న్యూస్ ప్రతినిధి చరవాణి ద్వారా వివరణ కోరగా ..ప్రతి బుధవారం ఎగ్ బిర్యానీ పెట్టాలని పైనుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ గుడ్ల సరఫరా, బిర్యానీ సరుకులు సకాలంలో సెంటర్లకు అందకపోవడంతో చిన్నారులకు బిర్యానీ అందించలేకపోతున్నామని తెలిపారు.ఇకనుండి సకాలంలో చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చూస్తామని ఆమె అన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు