భరోసా కేంద్రం సేవలు అభినందనీయం – జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు

మన న్యూస్, గద్వాల జిల్లా, జూన్ 25: లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, సైకలాజికల్ సహాయం వంటి సేవలను ఒకే గొడుగు క్రింద అందిస్తూ భరోసా కేంద్రం చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రం మూడవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భరోసా సిబ్బంది, బాధిత మహిళలతో కలిసి ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, అందిన సేవల వివరాలు భరోసా WSI స్వాతి మరియు సిబ్బంది ఎస్పీకి వివరించారు. బాధిత మహిళలకు తక్షణ ఆర్థిక సహాయం, విద్యా అవకాశాలు, న్యాయ సహాయం వంటి అనేక సేవలు అందుతున్నాయని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా, పదవ తరగతి చదువుతున్న బాధిత విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాధితుల స్టేట్మెంట్లు సరిగ్గా నమోదు చేయడంతో పాటు, వారికి నాణ్యమైన మానసిక, శారీరక సహాయాన్ని కల్పించాలన్నారు. బాధితులు భవిష్యత్తులో ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఎదగేలా ప్రోత్సహించాలన్నారు. భరోసా సేవలు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండాలని, సేవల పరంగా ఎప్పటికప్పుడు బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఇప్పటి వరకు అందిస్తున్న సేవల తీరును ప్రశంసించిన ఎస్పీ, భరోసా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గద్వాల డీఎస్పీ మొగిలయ్య, భరోసా కోఆర్డినేటర్ శివాని, స్రవంతి, శ్వేత, శిరీష, కవిత, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///