

మన న్యూస్ ,నెల్లూరు ,మే 8:నెల్లూరు 46 వ డివిజన్ కటారీ పాలెం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి ఆధ్వర్యంలో జరిగిన వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ……. వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.వెంకట శేషయ్య ఆచారి ఈ ఆరాధనోత్సవాలను ఎంతో చక్కగా నిర్వహించారని తెలిపారు.వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రచించి.. భవిష్యత్తును రాబోయే తరాలకు తెలియజేశారన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానంతో ఎంతోమంది సత్ప్రవర్తన కలిగి.. సర్వ మానవాళికి ఎంతో సహాయపడుతున్నారని తెలిపారు. వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని.. రాబోయే తరాలకు కూడా తెలియజేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి పై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 46 వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్, 8 వ డివిజన్ కార్పొరేటర్ కామాక్షి దేవి,మాజీ ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర రెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, యువజన విభాగం నాయకులు కిషన్, స్థానిక వైసిపి నాయకులు నాగేంద్ర,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
