మన న్యూస్,తిరుపతి: కాలు విరిగి పోయి చాలా భాదపడుతున్న ఓక మూగ జీవి ఆవు దూడకి హెల్పింగ్ హార్ట్స్ అండగా నిలబడి శస్త్రచికిత్సలు చేయించడం జరిగింది. తిరుపతి ఎస్వీ హైస్కూల్ గ్రౌండ్ వద్ద కాలు విరిగిన ఆవు దూడను గమనించిన హెల్పింగ్ హార్ట్స్ ప్రతినిధులు కల్లుపల్లి సురేంధర్ రెడ్డి, చంద్రగిరి కిశోర్ రెడ్డి, అడ్రాయిట్ ప్రణిత్ రెడ్డి, శేఖర్ నాయర్, చంద్రల చొరవతో మరికొంత మంది ఇందిరానగర్ వారి సహకారంతో హాస్పిటల్ కి తీసుకు వెల్లగా తిరుపతి ఎస్వీ వెటర్నరీ హాస్పిటల్ సర్జన్ ప్రోపెసర్ డాక్టర్ రఘునాధ్, డాక్టర్ భారతీ వారి వైధ్య బృందం ప్రత్యేక శ్రద్ద చూపి ఆవు దూడకి వైధ్యం అందించి, అల్యూమినియం రాడ్ లతో పిండి కట్టు వేసి కాలుకు చికిత్స అందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *