మన న్యూస్, ఆత్మకూరు, మే 8 : సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం గంగమ్మ తల్లికి చీర సారే… జలహారతి సమర్పించి నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మాట్లాడుతూ…………జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం కింద 3.60 లక్షల ఎకరాలకు 44 టిఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్టు కింద 1.60 లక్షల ఎకరాలకు 16 టిఎంసీలు నీటిని నేటి నుంచి రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో రెండో పంటకు నీటిని విడుదల చేయడంలో ప్రాంతాల మధ్య, రైతుల మధ్య, ప్రజా ప్రతినిధుల మధ్య తరచూ గొడవలు జరిగేవి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత సమగ్ర సాగు నీటి యాజమాన్య వ్యవస్థ, నీటి నిల్వ సామర్థ్యం, సరఫరాలో క్రమశిక్షణ పాటించడం వలన జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల్లో సుమారు 100 టీఎంసీల నీరు నిల్వ చేశాం…దీంతో రెండో పంటకు సాఫీగా నీటిని విడుదల చేయగలుగుతున్నాం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమశిల జలాశయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు జిల్లాలో రెండో పంటకు నీటిని విడుదల చేస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు మొదలుపెట్టాం… ఈ పనులు పూర్తయితే మర్రిపాడు, అనంతసాగరం మండలాల రైతాంగానికి సాగునీటి సమస్య తీరుతుంది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు… ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గం రైతాంగానికి నీరు పుష్కలంగా లభిస్తుంది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత రెండో పంటకు జిల్లా రైతాంగానికి నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *