

మన న్యూస్ నర్వ మండలం:- వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్వ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నర్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. నర్వ మండలంలో నర్వ, లంకాల, లక్కర్ దొడ్డి, జక్కనపల్లి గ్రామాల విద్యార్థులు ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ విజ్ఞాన ఈ తరగతులలో ముఖ్యంగా విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధి పెంపొందించేందుకు కథలు చదవడం, రాయడం, పుస్తకాలు చదవడం, విలువలు విద్య, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్ పేపర్ క్రాఫ్ట్, డ్యాన్స్, చెస్, జికె, యోగ మొదలైన అంశాలను నేర్పిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్ గా బోధించడానికి ప్రతిభ కలిగిన వారు తమ పేర్లను నమోదుచేసుకోవాలని ఆయన కోరారు.
