శంఖవరంలో యధాతధంగా కొనసాగుతున్న దళితోద్యమం

  • తెరపైకి పలు డిమాండ్లు.
  • యధావిధిగా కొనసాగుతున్న పోలీసు కాపలా
  • పలు గ్రామాల దళిత నేతలు, ప్రజల సంఘీభావం..
  • వంటా వార్పూ ఉద్యమ వేదిక వద్దే…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ నగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు చెప్పులు దండ వేసిన పడాల వాసు తో పాటు మిగతా వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని గురువారం దళిత సంఘాల డిమాండ్ చేశాయి. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకొని బలమైన ద్వారా కేసులు నమోదు చేసే వరుకుఉద్యమాన్ని విరమించేది లేదని దళిత సంఘాల నాయకులు ప్రధాన డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ 24 గంటల్లో చెప్పులు దండ వేసిన వారిని అరెస్టు చేస్తామని చెప్పి మొక్కుబడిగా ఒక వ్యక్తిని మాత్రమే అరెస్టు చేయడమే కాకుండా, తూ తూ మంత్రంగా సెక్షన్లు విధించడం పట్ల దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు మండిపడ్డారు. జిల్లా ఎస్పీ శంఖవరం వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ పై చెప్పులు దండ వేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అగ్ర కులాల వారు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చెప్పులు దండ వేసిన వ్యక్తితోపాటు, ప్రోత్సహించిన వారిని, సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గతంలో అగ్రకుల అహంకారంతో అనేకమార్లు ఎస్సీ పేట పై దాడికి పాల్పడడమే కాకుండా, గతంలో జిల్లా ఎస్పీని సైతం కొట్టిన సంఘటన జరిగిందని గుర్తు చేశారు. జిల్లా ఎడ్మిన్ ఎస్పీ ఎం జె వి భాస్కరరావు ఆందోళన శిబిరానికి చేరుకుని ఇప్పటికే చెప్పుల దండ వేసిన పడాల వాసును అరెస్ట్ చేయడం జరిగిందని, అతనికి ఎవరు సహకరించినా, ప్రోత్సహించినా అట్టి వారి పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయితే పూర్తిస్థాయిలో విచారించేందుకు కొద్ది సమయం పడుతుందని సర్ది చెప్పారు. అయినప్పటికీ ఆందోళనకారులు వినిపించుకోకపోవడంతో శిబిరం వద్ద నుండి వెళ్లిపోయారు. ఒకానొక దశలో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణంచోటుచేసుకుంది. అయితే 4 గంటలసమయంలో మరొసారి జిల్లా ఎడ్మిన్ ఎస్పీ ఎం జె వి భాస్కరరావు నిరసన శిబిరం వద్దకు చేరుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి మిగతా వారిని కూడా అదుపులో తీసుకుంటామని ఆయన తెలిపారు. నిందితుడుపడాల వాసు ప్రోత్సహించిన వారు పైన అలాగే, వాసుని దాచిపెట్టినతల్లిదండ్రుల, మేనమామ పై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కుట్ర వెనకాల ఎవరైతే దాగి ఉన్నారో వారందరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన తెలియజేశారు. కొన్ని ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాన్ని దళిత నాయకులు అడ్మిన్ ఎస్పీభాస్కరరావు కు అందజేశారు. తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేశారు. యధావిధిగా సోమవారం నుంచి ఉద్యమాన్నిసేపడతామని దళిత సంఘాలు తెలిపాయి. ఉద్యమ వేదిక వద్దే వంటా వార్పూ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఉద్యమంలో తుని , కాకినాడ ,రౌతులపూడి, చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రాంతాల గ్రామ నాయకులు, స్థానిక నాయకులు, జై భీమ్ యూత్ సభ్యులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):ఆంధ్రాలో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ సారి చాలా మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించారు.చదువుకునే రోజుల్లో 10వ తరగతి చాలా ముఖ్యమైనది. అందుకే విద్యార్థులు విద్యాసంవత్సరం మెుదటి నుంచే సన్నద్ధం…

    మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

    మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు