

Mana News:- Srikalahasti:- .అధ్బుతమైన పరిపాలనా దక్షతతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని నిత్యం పరితపించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గిరిజనులకు ఇష్టుడని శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె కొనియాడారు.అజాత శత్రువుగా, శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ఘనకీర్తి పొందిన మాజీ మంత్రి,స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి 76 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు డా.నివేదిత మోరె ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం లోని కొత్త కోనేరు యస్టీ కాలనీలో గల గిరిజనుల మధ్య శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా కేక్ చేయించి, స్వీట్లు పంచి పెట్టారు.తన తండ్రి గోపాలకృష్ణా రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమంలో తమతో పాటు పాల్గొని,కేక్ చేసిన తమ అభిమాన ప్రజా నాయకుడు,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డి,రాష్ట్ర కార్యదర్శులు దశరధాచారి,గాలి చలపతి నాయుడు,వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి, తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,మైనారిటీ విభాగం తిరుపతి పార్లమెంటు నాయకుడు సయ్యద్ చాంద్ బాషా, నూర్ మొహమ్మద్,షేక్ రియాజ్,సులేమాన్, భగత్, బిసి విభాగం నాయకులు దాము, భాస్కర్, మణి తదితరులు పాల్గొన్నారు.