మన న్యూస్ సింగరాయకొండ :-
ఉలవపాడు మండలం కోటిరెడ్డి గుంట కాలనిలో హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తమ కుమార్తె శ్రీ తేజస్విని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వెళ్లు చిన్నారులకు స్కూల్ బ్యాగులు మరియు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ కాలనీలో చిన్నారులు సుమారు ఒక కిలోమీటరు దూరం ఉన్న పాఠశాలకు రోజూ నడిచి వెళ్లి చదువుకుంటారని, రానున్న విద్యా సంవత్సరంలో వీరికి అవసరమైన స్కూల్ బ్యాగులు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా విద్యార్థులకు మనం అందించే విద్యా సామాగ్రి, గిఫ్ట్ లు వారికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ చదువు పట్ల ఆసక్తి కలిగించుటకు తోడ్పాటు ఇస్తాయని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ తమీన్ అన్సారియా వారి పర్యవేక్షణలో బాలల విద్యాభివృద్ధికై బాల కార్మికుల నిర్మూలన,ఒప్పంద కార్మికుల బంధ విముక్తి మరియు బంగారు బాల్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ వంతుగా బాలల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు.కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుని వరలక్ష్మి మరియు తమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *