

మన న్యూస్, తిరుపతి :– తిరుపతి బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల నవీన్ మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం విధితమే.. కర్మ క్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం మాజీ సీఎం, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తిరుపతిలోని వివి మహల్ రోడ్ లో ఉన్న నవీన్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారి మాతృమూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపి అందరికీ ధైర్యం చెప్పారు. నవీన్ కుమార్ రెడ్డి సోదరులు భువన్ కుమార్, జీవన్ కుమార్ లతో పాటు బంధు మిత్రులందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు వారి వెంట నిఖిలేష్ రెడ్డి,రెడ్డప్ప రెడ్డి,అమాస రాజశేఖర్ రెడ్డి,నిరంజన్ రెడ్డి,పురుషోత్తం నాయుడు,వెంకట,ప్రసన్న సురేష్ మహేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు..
