

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలోని 30 మరియు 31వ డివిజన్ లలో స్థానిక ప్రజలతో కలసి అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపనలు చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తిచేసి, ప్రజలకు అందిస్తాం అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.మంచి కార్యక్రమములు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని ప్రజలందరూ ఆశీర్వదించండి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
303 పనులకు శంకుస్థాపనలు చేశాము, మే 20వ తేదీన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలసి ప్రారంభిస్తాము అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
