

మనన్యూస్,సర్వేపల్లి:నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ……. కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించినా, ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప, భయపడం అని అన్నారు. రాజకీయంగా పోరాడలేక మాపై అక్రమ కేసులకు పాల్పడుతున్నారు అని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం భయపడకుండా ఎదుర్కొంటాం అని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అని తెలిపారు.కేసులు, అరెస్టులు, దాడులు, విధ్వంసపాలనతో రాష్ట్రం అట్టుడుకుతుంది అని తెలిపారు.
ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బలమైన ఎదురుగాలులు వీస్తున్నాయి అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు.ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న 2.O పాలనలో కష్టపడిన నాయకులు, కార్యకర్తలను గుర్తిస్తాము అని తెలిపారు.
జగనన్న 2.O పాలనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను హింసించిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టం అని అన్నారు.
అధికారం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడితే, ఇబ్బంది పెట్టిన వారిని వంద రెట్లు అధికంగా ఇబ్బందుల పాలు చేయడం ఖాయం అని తెలిపారు.జిల్లాలో పండించిన ధాన్యాన్నికి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు అని అన్నారు.సోమిరెడ్డి దళారులతో అంటకాగుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ద్రోహం చేస్తున్నాడు అని తెలియజేశారు. సోమిరెడ్డి పాపాలన్ని నమోదు చేస్తున్నాం, వడ్డీతో సహా సోమిరెడ్డికి తిరిగి చెల్లించడం ఖాయం అని అన్నారు.సోమిరెడ్డితో సహా, రైతుల శ్రమను దోచుకుంటున్న దళారులను ఎవ్వరినీ విడిచిపెట్టం అని అన్నారు. గ్రామాల వారిగా బాధ్యతలు నిర్వర్తించగలమన్న వారికి పార్టీ పదవులు అప్పగిస్తాం అని తెలిపారు.గ్రామాలలో ఎటువంటి సమస్య వచ్చినా, సత్వరమే స్పందించి అండగా నిలుస్తాం.గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై, అధికారం లేకపోయినా, ప్రజల అవసరాలను గుర్తించి, ఆదుకునేందుకు ప్రయత్నించండి అని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేద్దాం. కూటమి ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప, అభివృద్ధి జాడ కనిపించడం లేదు అని అన్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, తక్షణమే స్పందించేందుకు సిద్ధం గా ఉంటాము అని అన్నారు.
