మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలో 43వ రోజు మంగళవారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం 1వ డివిజన్, కోడూరుపాడు కొత్త సంఘం నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించాను అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ముచ్చటగా మూడోసారి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి భారీ మెజార్టీ ఇచ్చిన రూరల్ ప్రజలకు రుణపడి ఉంటాం అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, గంగి జయరామిరెడ్డి, తంబి శ్రీనివాసులు, కుడుముల చిరంజీవి, జావిద్, కల్లూరు మోహన్, బోడేదుల సునీల్, రామిరెడ్డి రమేష్ రెడ్డి, తంబి వెంకటరమణయ్య, రామిరెడ్డి జయ ఓబుల్ రెడ్డి, సర్వేపల్లి సుకుమార్, ఆమలూరు సుమంత్, తగరం మల్లికార్జున, మరియు 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *