SBI: బ్యాంకు పేరుతో వీడియోలు వస్తున్నాయా.? కీలక నోటీస్‌ జారీ చేసిన ఎస్‌బీఐ..!

Mana News :- SBI: రోజురోజుకీ సైబార్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కొంగొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. ఇందులో భాగంగానే ఓ పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది. ఎస్‌బీఐ బ్యాంక్‌ పేరుతో సోషల్‌ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు వ్యాపిస్తున్నాయని, అందులో ఉన్నతాధికారులను ఉటంకిస్తూ నకిలీ పెట్టుబడి పథకాలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ అయిన ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. తమ బ్యాంకు అధిక వడ్డీ లాభాలు అందించే ఏ పెట్టుబడి పథకాన్నీ ఆమోదించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనల వల్ల ప్రజలు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఉపయోగించి కొన్ని ఫేక్‌ వీడియోలను రూపొందిస్తున్నారు. అచ్చంగా నిజమైన వ్యక్తుల్లా కనిపించే వీడియోలను రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఏఐతో తయారు చేసిన వీడియోలను చాలా సింపుల్‌గా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాయిస్‌లో తేడాలు, ముఖ కవలికల్లో తేడాలతో ఫేక్‌ వీడియోలను సింపుల్‌గా గుర్తించవచ్చని చెబుతున్నారు. అందుకే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏ సమాచారాన్నైనా అధికారిక వెబ్‌సైట్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌ల్లోనే పొందాలని సూచిస్తున్నారు. అధిక లాభాలను హామీ ఇచ్చే పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే బ్యాంకు సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం వెంటనే బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్ లేదా స్థానికంగా ఉన్న బ్రాంచ్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.

Related Posts

తవణంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – వృద్ధురాలు మృతి

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30:చిత్తూరు–అరగొండ రహదారిపై తవణంపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. గంగవరం మండలం కీళపట్ల గ్రామానికి చెందిన టి. మునీంద్ర తన నాన్నమ్మ టి. నారాయణమ్మ (వయసు 74, భర్త…

ఏసీబీ వలలో కల్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి – లంచం తీసుకుంటూ పట్టుబాటు

అనంతపురం జిల్లా మన న్యూస్:- కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి చీకటి ఛాయలు తెరుచుకున్నాయి. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిపై ఫిర్యాదులు రావడంతో, అతనిపై ఎప్పటినుంచో కన్నేసిన ఏసీబీ అధికారులు చివరికి ట్రాప్ వేసి పట్టుకున్నారు.పక్కా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///