మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దారుణం జరిగింది.భార్యాభర్తల మధ్య గొడవతో భర్త నర్సింలు భార్య మహేశ్వరినీ అతి దారుణంగా కత్తితో పొడిచి భర్త నర్సింలు సైతం పోడుచుకున్నాడు.దీంతో భార్య మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా భర్త కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.మృతి చెందిన భార్య 48 సంవత్సరాల వయస్సు గల మహేశ్వరిగా గుర్తించగా భర్త 60 సంవత్సరాల వయసు గల నర్సింలు గా గుర్తించారు.విషయం తెలుసుకున్న ఏఎస్పి చైతన్య రెడ్డి,సిఐ చంద్రశేఖర్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం అందాదా ఒంటిగంట 50 నిమిషాల మధ్యాహ్నం ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు గొడవపడి భర్త నర్సింలు భార్య మహేశ్వరిని కత్తితో దాడి చేయడం జరిగిందని,భార్య అక్కడికక్కడే మృతి చెందిందని,అదే కత్తితో భర్త నర్సింలు కూడా కత్తితో పొడుచుకోవడం జరిగిందని వారిద్దరికీ పిల్లలు కూడా లేరనీ వారు ఆర్బి నగర్ కాలనీలో ఉంటున్నారని తెలిపారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *