

Mana News :- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 05 రాత్రి ఆయన మరణించారు.రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి మరణించారు. తన ఇంట్లోనే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన సమయంలో వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్ మెన్‌గా ఉన్న రంగయ్యను సీబీఐ సాక్షిగా చేర్చింది. సీబీఐ అధికారులు ఆయన స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న రంగయ్యకు పోలీసులు భద్రతను కల్పించారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగయ్యకు భద్రత కారణాల రీత్యా 1+1 భద్రతను కల్పించారు.2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటికీ ఈ కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. దర్యాప్తు అధికారులపై వైఎస్ఆర్ సీపీ నాయకులు అప్పట్లో ఆరోపణలు చేశారు. దర్యాప్తు ఆలస్యంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు గతంలో దిల్లీకి వెళ్లి వైఎస్ సునీతా రెడ్డి సీబీఐ అధికారులను కలిశారు. దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని కోరారు.