రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తుంది- రెడ్‌ బుక్‌పై లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..

Mana News :- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్‌బుక్‌పైనే చర్చ సాగుతోంది.. ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీ విమర్శిస్తోంది..అయితే, రెడ్‌బుక్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్‌.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తుందన్నారు.. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ అయ్యిందన్నారు.. అయితే, ఎవరినో వదిలేస్తాం అనే ఆలోచన మాత్రం వద్దు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్‌.. ఇక, ఈవీఎం అయినా బ్యాలెట్ అయిన గెలుపు కూటమిదే అన్నారు లోకేష్.. 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది.. ఇప్పుడు 9 నెలల పాలనలో సీఎం చంద్రబాబు విజయం సాధించారు.. భారీ మెజారిటీతో గెలిస్తేనే గెలుపు అని నేను ఆనాడే చెప్పాను.. ఇంకో ఇద్దరు నాయకులు మండలికి వస్తున్నారు. కౌన్సిల్ లో ఉన్న మొత్తం 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు గాను అన్నింటినీ టీడీపీ కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం కష్టపడిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు, నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే వన్ డే ఎమ్మెల్యే.. డిపాజిట్ రాదని కనీసం పోటీకి కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు.. జగన్ చేస్తున్న పనులకు, కొత్త పేరు పెట్టాం.. “వన్ డే ఎమ్మెల్యే”.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం, ఒక రోజు అసెంబ్లీకి వచ్చి హడావిడి చేసి బెంగళూరు పారిపోతాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి నారా లోకేష్.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు