

Mana News, తిరుపతి:- తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. జిల్లా ప్రధాన కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బందికి క్యాంపు కార్యాలయం నందు హెల్మెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. లైసెన్సు మరియు సంబంధిత రికార్డులు కలిగి ఉండాలని సూచించారు. అతివేగం అనర్ధాలకు దారితీస్తుంది. ఐదు పది నిమిషాలకు తొందరపడి ప్రాణాలు మీదికి తెచ్చుకోవద్దని, మీ ప్రాణాలు ఎంతో విలువైనవని, మీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉందని ఎప్పుడు గుర్తుంచుకొని వాహనం నడపమని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బి. హేమంత్ ట్రైన్ ఐపిఎస్, గారు, శ్రీ కే రవిమనోహరాచారి, అదనపు ఎస్పీ శాంతి భద్రతలు, శ్రీ రామకృష్ణ చారి డిఎస్పీ ట్రాఫిక్, సాదిక్ అలీ ఏస్.బి సి. ఐ, శ్రీ సంజీవ్ కుమార్, శ్రీ.భాస్కర్ ట్రాఫిక్ సిఐ లు ఎస్ఐలు, శ్రీ సురేష్ బాబు ఎ.ఒ. మరియు సిబ్బంది పాల్గొన్నారు.