Mana News :- 2024 ఎన్నికలు ఒక చరిత్ర.. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ విజయం మరో చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ లో కూడా రెండు టీచర్ సంఘాలకు ఓట్ వేయమని చెప్పాము .పని చేసే వారికే గెలుపు వరిస్తుంది. జనసేన తరపున పవన్ కళ్యాణ్ కు అభినందనలు. బీజేపీ, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణ తో పని చేసారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రం నుంచి పూర్తిగా సహకరిస్తోంది అని పేర్కొన్నారు సీఎం.అమరావతి స్మశానం అన్నారు. రాజధాని పేరుతో ముడుముక్కలాట ఆడారు. కానీ విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని ఫౌండేషన్ వేసారు. ప్రధాని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేశారు. 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కలిసి కట్టుగా ఉంటే ఏ పార్టీ అధికారంలోకి రాదు. ఎమ్మెల్యేలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని సీఎం స్పష్టం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *