నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. నెలకు 5 వేలు ఇచ్చే కొత్త స్కీమ్ !

Mana News :- విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు ఓ తీపి కబురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. రీసెంట్ గా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త స్కీమును ఆవిష్కరించింది. అదే పీఎం ఇంటర్న్ షిప్ పథకం. ఈ స్కీమ్ తో ఎంతో మంది నిరుద్యోగులకు ఊరట లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పీఎం ఇంటర్న్ షిప్ పథకం వివరాలు:- ఈ స్కీము కింద నిరుద్యోగులకు ఏడాదిపాటు ట్రైనింగ్ అందించనున్నారు. ఉపాధి కల్పిచండంతో పాటు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 5వేల స్టై ఫండ్ కూడా అందించనున్నట్టు వెల్లడించారు. ఇలా ఏడాది పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.ఈ లెక్కన నెలకు ఐదు వేలు అంటే.. సంవత్సరానికి రూ. 60వేలు అందించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రధాన్ మంత్రి జీవన్ బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన వంటి స్కీమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుందని అర్దం అవుతోంది. ఆరు నెలలు ఇంటర్న్ షిప్ తర్వాత వారికి ఉపాధి లభిస్తుంది.ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే అభ్యర్ధులు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారంతా అర్హులని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11వ తేదీ వరకే సమయం ఉందని చెబుతున్నారు. ఇందుకు 21 నుంచి 24 ఏళ్ల లోపు వారు అర్హులని వివరించారు. అందుకోసం https://pminternship.mca.gov.in/login/ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.రిజిస్టర్ చేసుకునే విధానం :- రిజిస్టర్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పైన ఇవ్వబడిన లింకు ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన వివరాలన్నింటిని అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు