

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు సీతారాముల సేవలను పలువురు కొనియాడారు.
దేశానికి పల్లెలు పట్టుకొమ్మలని, గ్రామ అభ్యుదయమే దేశాభ్యుదయం అని భావించి నా వ్యక్తి ఉత్తమ సర్పంచు సీతారాములు. ప్రజల తో మమేకమై వారి అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపే వ్యక్తి సర్పంచ్ సీతారాములు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంత్రి చొరవతో గ్రామ అభివృద్ధికి కావలసిన నిధులు తెప్పించుకోవటంలో సీతారాములు దిట్ట. అరుదైన ఆయన సేవలకు ఢిల్లీలో పురస్కారం పొందటం గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాసాపురం పేరు, సర్పంచ్ పేరు మార్మోగడంతో గ్రామస్తులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.