కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.
ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు
కాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యే మంత్రులుగా పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేని ఎందరో రాజకీయ నాయకులు పొందుతున్న పెన్షన్ను
దగ్గుబాటిని పలువురు ఆదర్శంగా తీసుకొని వదిలివేయాలని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ అవసరం లేని వారు స్వచ్ఛందంగా వదులుకోవాలని గ్యాస్ బిల్లు రసీదుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే ఆచారం చెప్పినోల్లే ఆకూటికి లోబడ్డారన్న చందంగా పలువురు రాజకీయ నేతలు రెండేసి పెన్షన్లు పొందుతున్నారు. అలాంటి వారిలో భాజపా, టిడిపి, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీరు కోట్లకు పడగలెత్తారు. రాజకీయ పెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం వారికి లేదు. అలాంటి నేతలు పింఛన్ల కోసం కక్కుర్తి పడటం విస్మయాన్ని కలిగిస్తోంది. రాజకీయ నాయకుల హోదాల్లో మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నో వసతులు పొందారు. తిరిగి మాజీలుగా పెన్షన్లు పొందుతున్నారు. ఏనుగు చచ్చినా వేయి వరహాలు అంటే ఇదే కాబోలు.. 1953 వేతనాలు పెన్షన్ యాక్టివ్ సవరించి ఒక వ్యక్తికి ఒక పెన్షన్ అందేలా చర్యలు తీసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఐ ఆక్టివిటీ గణేష్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సహ చట్టం ద్వారా రాజకీయ నాయకులు పొందుతున్న రెండేసి పెన్షన్లను బట్టబయలు పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ నటుడు చిరంజీవి రెండేసి పెన్షన్లు పొందుతున్నారు. ఒకటి ఎంపీగా మరొకటి ఎమ్మెల్యేగా పెన్షన్లు పొందుతున్నారు. ఆయన పెన్షన్ ఐడీలు 1942,4078: ఇతనికి పెన్షన్లు పొందాల్సిన అవసరమే లేదు. కాగా సాయం సమయంలో అందరికంటే ముందు ఉంటారని తెలిపారు. నెలకు 61 వేలు పొందుతున్నారు. దీనిని స్వచ్ఛందంగా వదులుకొని ఆదర్శంగా నిలవాలి.
అశోక గజపతిరాజు : ఇతను సైతం రెండేసి పెన్షన్లు పొందుతున్న వారిలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన వారు కాగా అధిక మొత్తం పెన్షన్ పొందుతున్న వారిలో ఈయన ఉన్నారు. ఇతను ఒక పెద్ద జమీందారు కుటుంబీకుడు. పెన్షన్ పొందటం అవసరమా అని ప్రశ్నించారు. కాగా కూటమి ప్రభుత్వ సిఫారసు మేరకు గోవా గవర్నర్గా నియామకం కావడంతో పెన్షన్ వదులుకొని జీతం మాత్రం పొందుతున్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్ పెన్షన్ ఐడీలు2113,333 రెండు పెన్షన్లు నెలసరి 61 వేలు పొందుతున్నారు. ఇతను ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇతను పెన్షన్ పొందటానికి అనర్హుడు. నెల రోజుల ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు : నెలరోజుల ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు సైతం ఎంపీ ఎమ్మెల్యేగా నెలకు 61 వేల రూపాయలు పొందుతున్నారు
అనంత వెంకటరామిరెడ్డి: వైయస్సార్సీపీ పార్టీకి చెందిన అనంత వెంకటరామిరెడ్డి ఎంపీ ఎమ్మెల్యే 674,371 ఐడి నెంబర్లతో నెలకు 61 వేలు పెన్షన్ పొందుతున్నారు. తెలంగాణకు చెందిన సర్వే సత్యనారాయణ మంత్రి ఎమ్మెల్యేగా పనిచేశారు 694,2223 పెన్షనర్ ఐడి నెంబర్లతో నెలకు అరవై ఒక్క వేల రూపాయలు పొందుతుండగా, సోయా బాబురావు 1383990 ఐడి నెంబర్లతో నెలకు 61 వేల రూపాయలు పొందటం గమనార్హం
కాగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని పలువురు రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో వీరి అనంతరం పెన్షన్ పొందటానికి జీవిత భాగస్వాములు సైతం అర్హులే. పెన్షన్ పొందుతున్న అధి కుల్లో ధనవంతులు పారిశ్రామికవేత్తలు. ఒక వ్యక్తి ఒక పెన్షన్ పొందటం ఓకే. మరి రెండేసి పెన్షన్లు పొందటం సరికాదు.
వీరే కాకుండా మరి కొంతమంది రాజకీయనేతలు ద్వంద పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు.
1953 వేతనాలు పెన్షన్ల యాక్టు సవరించి ఒక వ్యక్తి ఒకే పెన్షన్ పొందే విధంగా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చట్ట సవరణ కోసం ఉద్యమించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా శ్రీకారం చుట్టాలని, తదనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేశారు.
