కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి

మన న్యూస్:పినపాక నియోజకవర్గం,మణుగూరు సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేదని,సామాజిక కార్యకర్త కర్నె రవి అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓసి -2 లో జరిగిన ప్రమాదంలో ఆపరేటర్ మృతి ఘటన ఫై సమగ్ర విచారణ చేపట్టి ప్రమాదానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. గని ప్రమాదాలతో కార్మికులుభయాందోళనకు గురవుతున్నారనన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణ పై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించి బాధ్యులపై క్రిమినల్ చర్య తీసుకొని, వారిని సస్పెండ్ చేయాలన్నారు.ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కార్మికుల పై ఒత్తిడి చేస్తూ పని చేయుంచడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింరేణి అధికారులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాడానికే పని చేస్తున్నట్లు కనబడుతుందని, కార్మికుల సంక్షేమం పట్ల గాని రక్షణ యాజమాన్యానికి పట్టింపు లేదన్నారు. కార్మికులను కాపాడటంలో భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. కార్మికుల పనిస్థలాల్లో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన రక్షణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. ఓసి -2 ప్రమాదానికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, కార్మిక అవగాహన లేని సూపర్వైజర్లు, కాలం చెల్లిన యంత్రాలు, వాహనాలు, సరైన రక్షణ చర్యలు లేక పోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు.రక్షణకు సంబంధించి రోడ్ల విషయంలో, దుమ్మును అరికట్టడంలో, ఫైర్‌ కోల్‌ నిరోధించడంలో గాని,మిషనరీపూర్తిస్థాయిలో మర
మ్మతులు చేసి అందించడంలో గాని కార్మికులకు కావలసిన సేప్టీ పరికరాలను అందించడంలో ఏరియాలో అధికారులు ఎప్పుడూ నిర్లక్ష్యం వహించి,కార్మికులను ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తున్నా రని విమర్శించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోవాల్సినకార్మిక సంఘాల నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం క పనిచేస్తున్నారని, మాది జాతీయ సంఘం కాదు, మాది జాతీయ సంఘం అంటూ గొప్పలు చెప్పు కుంటున్న నాయకులు యాజమాన్యానికి, అధికారులకు తోత్తులు గా వ్యవహరిస్తున్నారని, ఆయన దుయ్యబట్టారు. ఓ వైపు కార్మిక మరణంతో విషాదం నెలకొనగా జిఎం ఇతర అధికారులు ముగ్గుల పోటీలతో తరిస్తున్నారని, కార్మికులకు పై వారికున్న చిత్తశుద్ధిని ఈ ఘటన తెలియజేస్తుందన్నారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు