

పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీహార్ వ్యక్తి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- గద్వాల పట్టణ కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్ ఖాని ఏటీఎం మిషన్లో 8000 జమ చేసి వెళ్లాడు. కానీ ఏటీఎం మిషన్ లో వేసిన అమౌంట్ రిటర్న్ వచ్చిన సంగతి చూసుకోలేదు బీహార్ కు చెందిన వ్యక్తి. ఆ డబ్బులు అతను ఖాతాలో పడకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. స్పందించిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ ఏటీఎం సీసీ కెమెరా మరియు గద్వాల పట్టణ కేంద్రాలలో అమర్చినటువంటి ఏటీఎం ముందు ఉన్న సీసీ కెమెరాల ద్వారా అసలు విషయాన్ని కనుగొన్నాడు. బీహార్ కు చెందిన వ్యక్తి 8000 వేలు డబ్బులు ఏటీఎం మిషన్ లో వేసి వెళ్ళాడు కానీ అవి ఏటీఎం మిషన్ లో జమ కాకపోవడం, వెనకాల ఉన్న వ్యక్తి అట్టి డబ్బులు తీసుకెళ్లడం ఇదంతా సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ గంట వ్యవధిలో డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి 8000 రూపాయలను బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్ ఖానీ కు ఎస్సై అందించడం జరిగింది. పోగొట్టుకున్న డబ్బును అందించినందుకు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు బీహార్ వ్యక్తి. అంతేకాకుండా సమస్య తెలిసిన వెంటనే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏటీఎం సీసీ కెమెరా, ఏటీఎం ముందు ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి రికవరీ చేసినందుకు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ కు పలువురు మరియు వారి సిబ్బంది చందు, కిరణ్ కుమార్ అభినందనలు తెలియజేస్తున్నారు