విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి.

ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు

మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:-

దేశం లో రోజురోజుకి అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజలను చేస్తున్న మోసాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. బుధవారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంబేత్కర్ గురుకుల పాఠశాల, మలినేని లక్ష్మయ్య విద్యా సంస్థలలో నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలను సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర సమన్వయం పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ కొత్తపల్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సమాజం లో చోటు చేసుకుంటున్న సైబర్ క్రైమ్,నేరగాళ్ల నేర్పరి తనం, మోసాలకు గురవుతున్న ప్రజల అమాయకత్వం గురించి అవగాహన కల్పించారు. సంబంధం లేని మెసేజ్ లు మోసాలకు దారి తీస్తాయని వాటి జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై బండ్లమూడి మహేంద్ర మాట్లాడుతూ పెరుగుతున్న, అందుబాటులో ఉంటున్న సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని అనవసరమైన యాప్ ల జోలికి పోయి కష్టాలు కొని తెచ్చుకోవద్దని హితవు చెప్పారు. పరిచయం లేని వారి తో అనవసర చాటింగ్ లు చేయడం క్షేమం కాదని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..