

Mana News:- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి విజయవాడ జింఖానా గ్రౌండ్ లో డిసెంబర్ 4న సీపీఐ,(ఎం.ఎల్.) లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయాలని కోరుతూ లిబరేషన్ కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ మండలంలోని భద్రవరం, లింగంపర్తి, ఏలేశ్వరం, ఎర్రవరం, పెద్దనాపల్లి మీదుగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు బుగత బంగార్రాజు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాన్ని విమర్శిస్తూ అందలం ఎక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతాను మూటకట్టుకుందని విమర్శించారు. సూపర్ 6 పేరుతో జనాకర్షక పధకాలను వాగ్దానం చేసిన టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. కార్పొరేట్ బాసుల నమ్మిన బంటు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పేద మద్య తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత అనుభవిస్తున్న వాస్తవ సమస్యలపై ఆరు డిమాండ్లు లేవనెత్తి పీపుల్స్ సిక్స్ పేరుతో లిబరేషన్ ఉద్యమం చేపట్టిందని అన్నారు. ఈఉద్యమంలో భాగంగా చేపట్టనున్న ప్రజా హక్కుల సభను విజయవంతం చేయాలని బుగత బంగార్రాజు కోరారు. ఈర్యాలీలో లిబరేషన్ పొలిట్ బ్యూరో సబ్యులు వి శంఖర్, జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకోండ లచ్చబాబు, ఏఐసిసి టి యు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, నీరుకొండ నాగేశ్వరరావు, నాగమణి, వి రత్నం తదితరులు పాల్గొన్నారు.