మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ , డ్రైన్ సమస్యగా ఉందని మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి నారాయణ ప్రహరీ గోడతోపాటు, డ్రైను నిర్మాణం చేపడతామని శనివారం హామీ ఇచ్చారు .24 గంటలు తిరక్కముందే నిధులు మంజూరు చేసి ఆదివారం నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు.పనులను శరవేగంగా చేపట్టాలని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు.తమ చిరకాల కోరిక నెరవేరబోతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేసారు .మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు తహసీన్, రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.








